teacher: చిన్నారిని చిత‌క్కొట్టిన టీచ‌ర్‌.. స్కూల్ యూనిఫామ్‌పై ర‌క్త‌పు మ‌ర‌క‌లు!

  • హైద‌రాబాద్ తార్నాక‌లోని సీక్రెట్ హార్ట్ స్కూల్లో ఘ‌ట‌న‌
  • చిన్నారిని చూసి షాక్ అయిన త‌ల్లిదండ్రులు
  • పోలీసుల‌కు ఫిర్యాదు

చ‌దువుకోవ‌డానికి బ‌డికి వెళ్లిన ఓ చిన్నారి ర‌క్త‌పు మ‌ర‌క‌ల‌తో తిరిగి ఇంటికి వ‌చ్చాడు. కంగారుపడిన త‌ల్లిదండ్రులు ఏం జరిగిందని అడగితే, ఆ చిన్నారి షాకింగ్ నిజం చెప్పాడు. త‌న టీచ‌ర్ త‌న‌ను ఇలా ర‌క్తం వ‌చ్చేలా కొట్టింద‌ని తెలిపాడు. దీంతో ఆ చిన్నారి త‌ల్లిదండ్రులు పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

పూర్తి వివ‌రాల్లోకి వెళితే, హైదరాబాద్ తార్నాక‌లోని సీక్రెట్ హార్ట్ స్కూల్లో ఎండీ కాజా లతీఫ్ అనే విద్యార్థినిని టీచర్ వాతలు వచ్చేలా తీవ్రంగా కొట్టారు. దీంతో ఆ చిన్నారి తెల్ల‌ని చొక్కా కాస్త రక్త‌పు మ‌ర‌క‌ల‌తో మారింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థుల‌ను చితక్కొడుతోన్న‌ టీచ‌ర్లపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ ఇటువంటి ఘ‌ట‌న‌లు ఆగ‌డం లేదు. ఎక్కడో ఓ చోట ఇటువంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం అవుతూనే ఉన్నాయి.  

More Telugu News