srinivas reddy: ఎన్టీఆర్ విషయంలో నాపై జరిగిందంతా ప్రచారమే .. అందులో నిజం లేదు: కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి

  • ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం 
  • ఇక్కడ మాటలు అక్కడ .. అక్కడ మాటలు ఇక్కడ నేను చెప్పలేదు 
  • నా గురించి జరిగిందంతా ప్రచారం మాత్రమే      

కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ .. తనకి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. "ఎన్టీఆర్ కి సంబంధించి ఇక్కడ మాటలు అక్కడ .. అక్కడ మాటలు ఇక్కడ మీరు చెప్పారనీ, అందువల్లనే మిమ్మల్ని ఎన్టీఆర్ దూరం పెట్టారనే టాక్ ఇండస్ట్రీలో ఉంది .. ఇందులో నిజమెంత?" అనే ప్రశ్న శ్రీనివాస్ రెడ్డికి ఎదురైంది.

 "ఈ విషయం నా వరకూ రాలేదు .. నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. అంతగా మా మధ్య ఏం జరగలేదు కూడా. ఇక్కడ మాటలు అంటే .. ఎన్టీఆర్ గురించి అని ఒక క్లారిటీ వుంది. కానీ 'అక్కడ' అంటే .. అక్కడ ఎవరున్నది తెలియదు. ఇక్కడ అనేది తారక్ రేంజ్ అయితే .. అక్కడ అనేది ఆ రేంజ్ కి మించి ఉండాలి.

తారక్ రేంజ్ కి మించిన పరిచయాలు నాకు ఎవరితోనూ లేవు. తారక్ గురించి తక్కువ రేంజ్ వారికి చెప్పినందువలన ఆయనకి జరిగే నష్టం లేదు .. నాకు ఒరిగేదీ ఏమీ లేదు. అసలు అలాంటిదేం లేదు .. ఇదంతా పచ్చి అబద్ధం .. అనవసరమైన ప్రచారం. నా గురించిన రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా వింటే చెప్పమని నేను ఎన్టీఆర్ తో నేరుగా అన్నాను .. ఛ ఛా .. అలాంటిదేం లేదని ఆయనే స్వయంగా చెప్పారు" అంటూ స్పష్టం చేశారు.        

More Telugu News