'లెజెండ్' సినిమాకు అవార్డులు ఇవ్వడానికి కారణం ఇదే!: జ్యూరీ మెంబర్ ప్రసన్నకుమార్
- భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా ఇందులో మెసేజ్ ఉంది
- అమ్ముడుపోతున్న ఎమ్మెల్యేలపై చర్చ ఉంది
- అందుకే అవార్డు ఇచ్చాం
'లెజెండ్' సినిమాకు ఎక్కువ అవార్డులు రావడం పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తుండటం సరైంది కాదని అన్నారు. వారి వాదన తప్పు అని చెప్పారు. ఈ సినిమాలో అంతర్లీనంగా ఒక మంచి మెసేజ్ ఉందని అన్నారు. భ్రూణ హత్యలను వ్యతిరేకిస్తూ ఓ సన్నివేశంలో హీరో మాట్లాడతాడని... అలాగే, రాజకీయాల్లో అమ్ముడుపోతున్న ఎమ్మెల్యేల గురించి ఈ సినిమాలో చర్చ ఉందని చెప్పారు. వీటిని పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డులను ప్రకటించామని తెలిపారు.