Amitabh Bachchan: అమితాబ్ బ‌చ్చ‌న్‌కు తృటిలో త‌ప్పిన పెను ప్ర‌మాదం!

  • 23వ కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొని తిరిగి వెళ్లిన బిగ్ బీ
  • కారులో ఎయిర్‌పోర్టుకి వెళుతుండ‌గా ఊడిపోయిన వీల్ 
  • మ‌రో కారులో ఎయిర్‌పోర్టుకి వెళ్లిన అమితాబ్‌

బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు అమితాబ్ బచ్చన్ ప్రయాణిస్తోన్న మెర్సిడీజ్ కారు వెనుక చక్రం ఒక్క‌సారిగా ఊడిపోయింది. డ్రైవ‌ర్ కారును అదుపు చేయ‌డంతో పెద్ద ప్ర‌మాదం తప్పింది. ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు కారులో అమితాబ్‌తోపాటు పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ సీనియర్ మంత్రి కూడా ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఎవ్వ‌రికీ గాయాలు కాలేదు.

23వ కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొని అమితాబ్ తిరిగి వెళుతుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదం జ‌రిగిన అనంత‌రం అమితాబ్ మ‌రో కారులో విమానాశ్ర‌యానికి వెళ్లారు. ఆ కారు ఏర్పాటు చేసిన ట్రావెల్ ఏజెన్సీకి బెంగాల్ పోలీసులు షోకాజ్ నోటీస్ జారీ చేసి, విచార‌ణ కొన‌సాగిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. 

More Telugu News