nayanatara: విజయ్ జోడీగా రకుల్ ప్లేస్ లో నయనతార?

  • విజయ్ 62వ సినిమాకి సన్నాహాలు 
  • రకుల్ వైవు మొగ్గు చూపిన మురుగదాస్ 
  • తాజాగా తెరపైకి నయనతార పేరు 
  • అసలు విషయం తేలాల్సి వుంది        

తెలుగు .. తమిళ భాషల్లో దర్శకుడిగా మురుగదాస్ కి ఎంతో క్రేజ్ వుంది. ఇటీవల తెలుగు . . తమిళ భాషల్లో ఆయన చేసిన 'స్పైడర్' మాత్రం, ఆశించినస్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆయన తన తదుపరి సినిమాను విజయ్ తో చేయడానికి రెడీ అవుతున్నాడు. 'స్పైడర్' సినిమా సమయంలో రకుల్ పని తీరు నచ్చడంతో, విజయ్ సరసన కూడా ఆమెనే తీసుకోవాలని మురుగదాస్ భావించాడు.

 అయితే తాజాగా నయనతార పేరు వినిపిస్తోంది. తమిళనాట తిరుగులేని కథానాయికగా నయనతార వెలుగొందుతోంది. రీసెంట్ గా ఆమె చేసిన 'అరామ్' కూడా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అందువలన విజయ్ సరసన ఆమెను తీసుకున్నారనే టాక్ కోలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. అయితే రకుల్ తో పాటు నయనతారను తీసుకున్నారా? రకుల్ ప్లేస్ లో నయనతారను ఎంపిక చేసుకున్నారా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది. విజయ్ 62వ చిత్రంగా ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది.     

More Telugu News