speed eaters: ఆహారాన్ని వేగంగా తినే అల‌వాటు మానుకోండి... పరిశోధకుల హెచ్చరిక!

  • గ‌బ‌గ‌బా తినే వారు రోగాల బారిన ప‌డే అవ‌కాశం ఎక్కువ‌
  • మ‌ధుమేహం, హృద్రోగాల ముప్పు
  • వెల్ల‌డించిన జ‌పాన్ శాస్త్ర‌వేత్త‌లు

వెన‌కాల నుంచి ఎవ‌రో తొంద‌ర‌పెడుతున్న‌ట్లుగా ఆహారాన్ని సెక‌న్ల‌ వ్య‌వ‌ధిలోనే తినే వారు ఆ అల‌వాటు మానుకోవాల‌ని శాస్త్ర‌వేత్త‌లు హెచ్చ‌రిస్తున్నారు. అలా తిన‌డం వ‌ల్ల మ‌ధుమేహం, స్థూల‌కాయం, హృద్రోగాల వంటి రోగాల బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని వారు చెబుతున్నారు. అందుకే ప్ర‌శాంతంగా ఆహారం తీసుకోవాల‌ని వారు సూచిస్తున్నారు.

జ‌పాన్‌లోని హిరోషిమా యూనివ‌ర్సిటీ శాస్త్ర‌వేత్త‌లు వెయ్యిమందికిపైగా మధ్య వయస్కులపై ఐదేళ్లపాటు పరిశోధన జరిపి ఈ విష‌యాన్ని క‌నిపెట్టారు. ఈ ప‌రిశోధ‌న ద్వారా నెమ్మదిగా ఆహారం తినేవారికంటే.. వేగంగా తినేవారికి హై బీపీ, బ్లడ్‌ షుగర్‌, కొలెస్ట్రాల్‌ ముప్పు ఐదున్నర రెట్లు ఎక్కువని వారు తేల్చిచెప్పారు.

వేగంగా తినేవారిలో రోగాలబారినపడే ప్రమాదం 11.6 శాతమైతే, సాధార‌ణ వేగంతో తినేవారిలో 6.5 శాతమే ఉంద‌ని పరిశోధకుడు తకయుకి యమజి పేర్కొన్నారు. తొంద‌ర‌గా తిన‌డం వ‌ల్ల శరీరంలో గ్లూకోజ్ ప‌రిమాణంలో హెచ్చుత‌గ్గులు వ‌చ్చి, ఇన్సులిన్‌పై ప్రభావం పడుతుందని ఆయ‌న అన్నారు. కంగారుగా తిన‌డం వ‌ల్ల తినే ప‌దార్థాల‌ను గుర్తించ‌డానికి సమయం పడుతుంద‌ని, దీంతో ఇంకా ఎక్కువ మొత్తంలో తిన‌డం వ‌ల్ల స్థూల‌కాయం బారిన ప‌డొచ్చ‌ని య‌మ‌జి చెప్పారు.

More Telugu News