ఆధార్-సిమ్ అనుసంధానం ఇక ఈజీ.. ఓటీపీ ద్వారా లింకింగ్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- డిసెంబరు 1 నుంచి అందుబాటులోకి ఓటీపీ లింకేజీ
- టెల్కోల ప్రతిపాదనకు ఓకే చెప్పిన యూఐడీఏఐ
- ఇక ఇంటి దగ్గరి నుంచే అనుసంధానం
మొబైల్ నంబరుకు ఆధార్ అనుసంధానం కోసం ప్రభుత్వం గత నెలలో మూడు విధానాలను అమల్లోకి తీసుకొచ్చింది. తాజాగా ఆపరేటర్లు చేసిన ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్) ఆధారిత లింకింగ్ ప్రతిపాదనకు ఓకే చెప్పింది. తాజా విధానం ద్వారా మొబైల్ వినియోగదారులు ఇంటి దగ్గరి నుంచే ఓటీపీ, యాప్, ఐవీఆర్ఎస్ విధానాల ద్వారా ఆధార్‌ను లింక్ చేసుకునే అవకాశం చిక్కింది.