bandla ganesh: సినిమాకి ముందు హీరో, దర్శకులను మిత్రుల్లా చూస్తాను.. మొదలయ్యాక శత్రువులే!: బండ్ల గణేశ్

  • 'తీన్ మార్' కోసం త్రివిక్రమ్ చాలా కష్టపడ్డారు 
  • ఆ సినిమా ఎందుకు ఆడలేదన్నది ఇప్పటికీ అర్థం కాలేదు 
  • నాకు 'గబ్బర్ సింగ్' కన్నా ఆ మూవీనే ఎక్కువగా నచ్చుతుంది
  • సినిమా నిర్మాణం విషయంలో నేను సీరియస్ గానే వుంటాను

"త్రివిక్రమ్ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వలన .. 'తీన్ మార్' సినిమాపై పూర్తి దృష్టి పెట్టలేదనీ, అందువల్లనే ఆ సినిమా సరిగ్గా ఆడలేదనే ప్రచారం జరిగింది .. మీరేమంటారు?" అనే ప్రశ్న ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో బండ్ల గణేశ్ కి ఎదురైంది. అందుకాయన స్పందిస్తూ .. "ఆ ప్రాజెక్టుపై త్రివిక్రమ్ మనసు పెట్టలేదనే విషయంలో నిజం లేదు. ఆయన ఎంతవరకూ చేయాలో అంతవరకూ చేశారు. ఇప్పటికీ నాకు అర్థం కాలేదు, ఆ సినిమా ఎందుకు ఆడలేదో .. నిజం చెప్పాలంటే నాకు 'గబ్బర్ సింగ్' కన్నా అదే ఎక్కువగా నచ్చుతుంది".

"తీన్ మార్' సినిమా గుండెను పిండేస్తుంది .. మరి ఎందుకు ఆడలేదో. దానిని కరెక్ట్ గా ఎడిటింగ్ చేసి మళ్లీ ఇప్పుడు రిలీజ్ చేసినా సూపర్ హిట్ అవుతుంది .. డౌటే లేదు" అని చెప్పారు. "ఇక ఏ సినిమా అయినా మొదలుపెట్టే వరకూ హీరోను .. దర్శకుడిని నా ఫ్రెండ్స్ లా చూస్తాను. సినిమా మొదలయ్యాక ఎనిమీస్ (శత్రువులు) లా చూస్తాను. వీళ్లు .. ఏం చేస్తున్నారు? అది సినిమాకి ఏమైనా దెబ్బ అవుతుందేమో? అన్నట్టుగా వుంటాను. నన్ను బతికించేది సినిమా కాబట్టి ఆ విషయంలో అలా వుంటాను" అని చెప్పుకొచ్చారు.

More Telugu News