ఆ ఒక్క కథనంతో నా కెరీర్ సర్వనాశనం అయింది: హాలీవుడ్ నటి
- మేగజీన్ ప్రచురించిన కథనంతో కెరీర్ సర్వనాశనమైంది
- ఆ కథనంతో తాను బైసెక్సువల్ అని అందిరికీ తెలిసిపోయిందని వాపోయిన అంబర్ హియర్డ్
- లెస్బియన్-గే-బైసెక్సువల్-ట్రాన్స్ జెండర్ (ఎల్జీబీటీ) వర్గాలపై చిన్నచూపుంది
తాను జానీ డెప్, నికోలస్ కేజ్ వంటి స్టార్స్ తో నటించానని, ఆ సమయంలో ఎలా ఉండేదానినో వారినడిగి తెలుసుకోవాలని ఆమె సూచించింది. కొందరు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఎంత అభివృద్ధి చెందుతున్నా, సరికొత్త ఆవిష్కరణలు వస్తున్నా..కొన్ని విషయాల్లో ఎంత వెనుకబడి ఉన్నామో చెప్పేందుకు ఎల్జీబీటీలపై ఉన్న వివక్షే నిదర్శనమని ఆమె తెలిపింది. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని ఆమె హితవు పలికింది.