rahul gandhi: రాహుల్ ను 'పప్పు' అనడాన్ని నిషేధించిన ఈసీ!

  • బీజేపీ ప్రచారంలో రాహుల్ ను 'పప్పు' అంటూ ప్రకటనలు
  • ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
  • 'పప్పూ' అనడం అభ్యంతరకరమేనన్న ఈసీ
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని 'పప్పు' అని సంబోధించడాన్ని గుజరాత్ ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఆ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రాహుల్ ను 'పప్పూ' అని బీజేపీ నేతలు సంబోధిస్తున్నారని ఆరోపిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. దీనికి సాక్ష్యాలుగా బీజేపీ నేతల ప్రసంగాల స్క్రిప్టును కూడా పంపింది. ప్రసార మాధ్యమాలకు ఇచ్చిన ఓ ప్రకటనలో సైతం రాహుల్ ను 'పప్పు' అని బీజేపీ అభివర్ణించింది.

దీనిపై స్పందించిన ఈసీ, 'పప్పు' అన్న పదం అభ్యంతరకరమేనని తేల్చింది. ఓ నేతను అలా పిలవడం అవమానించడమేనని స్పష్టం చేస్తూ, ఆ పదాన్ని నిషేధిస్తున్నట్టు తెలిపింది. కాగా, దీనిపై స్పందించిన బీజేపీ, తాము వాడిన 'పప్పు' అన్న పదం ఏ నేతనూ ఉద్దేశించినది కాదని వెల్లడించింది. ప్రచార కార్యక్రమాల స్క్రిప్టును ఈసీ నేతృత్వంలోని మీడియా కమిటీకి పంపించి, వారి పరిశీలన అనంతరం వాడుతామని, 'పప్పు' పదం తొలగిస్తూ, సరికొత్త స్క్రిప్టును తయారు చేసి మరోసారి పరిశీలనకు పంపుతామని పేర్కొంది.
rahul gandhi
pappu
gujarath
election commission

More Telugu News