Nayan: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • నయనతారకు సూపర్ స్టార్ ప్రశంసలు 
  • మరో తెలుగు సినిమాలో కైరా దత్ ఐటెం పాట 
  • దుల్కర్ సరసన 'పెళ్లిచూపులు' భామ 
  • మణిరత్నం సినిమాలో జయసుధ
*  తాజాగా నయనతార కలెక్టర్ పాత్రలో నటించిన 'అరాం' తమిళ చిత్రాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రం తనకు బాగా నచ్చిందని, నయనతార అద్భుతంగా నటించిందని ప్రశంసించారు. దీంతో నయన్ ఆనందంలో తేలియాడుతోంది.  
*  ఇటీవల 'పైసా వసూల్' సినిమాలో బాలకృష్ణతో కలసి ఓ పాటలో డ్యాన్స్ చేసిన బాలీవుడ్ భామ కైరా దత్ ఇప్పుడు తెలుగులో మరో సాంగ్ చేయనుంది. 'ఈగో' సినిమాలో ఆశిష్ రాజ్ తో కలసి ఓ ఐటెం సాంగులో  చిందేయనుంది.
*  'పెళ్లిచూపులు' ఫేం రీతూవర్మ తమిళంలో ఓ చిత్రాన్ని చేస్తోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న 'కన్నుమ్ కన్నుమ్ కొల్లాయ్ అదితాల్' చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రోజు నుంచి ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది.
*  ప్రముఖ నటి జయసుధ చాలా కాలం తర్వాత మళ్లీ మణిరత్నం దర్శకత్వంలో నటిస్తున్నారు. గతంలో మణిరత్నం రూపొందించిన 'సఖి' సినిమాలో నటించిన జయసుధ, త్వరలో మణి తెరకెక్కించే చిత్రంలో కీలకమైన పాత్రలో నటించడానికి అంగీకరించినట్టు సమాచారం.   
Nayan
balakrishna
Reetuvarma
Jayasudha

More Telugu News