akhil: 'హలో' నుంచి న్యూ పోస్టర్ .. టీజర్ రిలీజ్ డేట్ ఖరారు

  • విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'హలో'
  • ఆసక్తితో ఎదురుచూస్తోన్న అక్కినేని ఫ్యాన్స్ 
  • ఈ సినిమా నుంచి న్యూ పోస్టర్ రిలీజ్ 
  • టీజర్ విడుదల ఈ నెల 16న

అఖిల్ కథానాయకుడిగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'హలో' సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో నాగార్జున నిర్మిస్తోన్న ఈ సినిమా, క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీజర్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఈ రోజున సర్ ప్రైజ్ చేస్తానని నిన్ననే అఖిల్ చెప్పాడు.

 దాంతో ఈ రోజున టీజర్ వదులుతారని అంతా అనుకున్నారు. కానీ అఖిల్ టీజర్ రిలీజ్ డేట్ మాత్రమే చెప్పాడు. ఈ నెల 16వ తేదీన టీజర్ ను రిలీజ్ చేస్తామని చెప్పిన అఖిల్, ఈ సినిమా నుంచి మరో కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్ కూడా యూత్ ను ఆకట్టుకునేలా వుంది. ఈ టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతాయనీ, ఈ సినిమా తనకి భారీ సక్సెస్ ను ఇస్తుందనే నమ్మకంతో అఖిల్ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.      

More Telugu News