Nagarjuna: ఈ వారమంతా నవ్వాం, ఏడ్చాం.. చాలా ఎమోషనల్ వీక్: నాగార్జున

  • ఈ వారమంతా చాలా ఎమోషనల్ గా గడిచిపోయింది
  • 'హలో' సినిమా ప్రమోషన్స్ ను కిక్ స్టార్ట్ చేయబోతున్నాం
  • ట్వీట్ చేసిన నాగార్జున

ఈ వారమంతా చాలా ఉద్వేగభరితంగా గడిచిపోయిందని ప్రముఖ సినీ నటుడు, నిర్మాత అక్కినేని నాగార్జున తెలిపారు. వారమంతా హాయిగా నవ్వుకున్నామని, ఎమోషన్స్ ని తట్టుకోలేక ఏడ్చేశామని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇప్పుడు మేమంతా 'హలో' చిత్రం ప్రమోషన్స్ పై దృష్టి సారించామని చెప్పారు.

ఈ మధ్యాహ్నం 2 గంటలకు ప్రమోషన్స్ ను కిక్ స్టార్ట్ చేయబోతున్నామని వెల్లడించారు. ఓ వైపు చై, సమంతల రిసెప్షన్ హడావుడి, మరోవైపు అఖిల్ తాజా చిత్రం 'హలో'ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే పనులతో నాగార్జున ఫ్యామిలీ ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News