stock markets: భారీ న‌ష్టాల‌తో ముగిసిన‌ స్టాక్ మార్కెట్లు!

  • 281 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌
  • 97 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • లాభాల స్వీకరణకు ఆస‌క్తి చూపిన మ‌దుప‌ర్లు

చివరి గంటల్లో మదుపర్లు లాభాల స్వీకరణకు ఆస‌క్తి చూపడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో ఈ రోజు స్టాక్ మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. 281 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ 33,033 వద్ద ముగియ‌గా, నిఫ్టీ 97 పాయింట్లు కోల్పోయి 10,225 వద్ద ముగిసింది.

ఇక‌ డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.65.46గా న‌మోదైంది. ఈ రోజు ఆరంభం నుంచి సూచీలు ఒత్తిడికి గురయ్యాయ‌ని విశ్లేష‌కులు పేర్కొన్నారు. సన్‌ఫార్మా, యూపీఎల్‌ లిమిటెడ్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం, టీసీఎస్‌, మహింద్రా అండ్‌ మహింద్రా షేర్లు లాభపడ్డాయి. కోల్‌ఇండియా, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, అదానీ పోర్ట్స్‌, అరబిందో ఫార్మా త‌దిత‌ర షేర్లు న‌ష్టపోయాయి.  

More Telugu News