రాష్ట్రపతి కుమార్తె ఉద్యోగాన్ని ఢిల్లీకి మార్చిన ఎయిరిండియా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాష్ట్రపతి కుమార్తె ఉద్యోగాన్ని ఢిల్లీకి మార్చిన ఎయిరిండియా!

  • ప్రధాన కార్యాలయానికి ట్రాన్స్ ఫర్
  • రాష్ట్రపతి కూతురుగా భారీ భద్రత ఉంటుంది
  • విమానంలో సెక్యూరిటీకి చోటు కల్పించడం కష్టం
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కుమార్తె స్వాతి ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియాలో ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తున్నారు. అయితే, భద్రతా కారణాల రీత్యా ఆమె ఉద్యోగంలో ఎయిరిండియా సంస్థ మార్పులు చేసింది. ఎయిరిండియా ఇంటిగ్రేషన్ డిపార్ట్ మెంటులో ఆమెకు విధులను అప్పగించారు. అంతకు ముందు ఆమె బోయింగ్ 787, బోయింగ్ 777 విమానాల్లో క్యాబిన్ క్రూ సిబ్బందిగా ఉన్నారు.

ఈ సందర్భంగా ఎయిరిండియాకు చెందిన ఓ ప్రతినిధి మాట్లాడుతూ, ఎయిరిండియా ప్రధాన కార్యాలయంలో ప్రస్తుతం ఆమె పని చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రపతి కుమార్తె కావడంతో ఆమె చుట్టూ భద్రతా సిబ్బంది ఉంటారని... ఎయిర్ హోస్టెస్ గా ఆమె కొనసాగితే, విమానంలో ఆమె భద్రతా సిబ్బందికి కూడా సీట్లు కేటాయించాలని, ఇది సాధ్యం కాదని... అందుకే ఆమెను ప్రధాన కార్యాలయానికి మార్చామని చెప్పారు.
ramnath kovind
swathi kovind
air india

More Telugu News