Chandrababu: బాధితులను పరామర్శించిన చంద్రబాబు.. మెరుగైన వైద్యం అందించాలంటూ ఆదేశం

  • ప్రమాద స్థలి నుంచి నేరుగా ఆసుపత్రికి సీఎం
  • బాధితులకు అందిస్తున్న వైద్యంపై ఆరా
  • మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ గొల్లపూడిలోని ఆంధ్ర ఆసుపత్రికి చేరుకున్నారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పడవ ప్రమాద బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్యులతో ఆయన మాట్లాడారు. బాధితులకు అందిస్తున్న వైద్యసాయంపై ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. అంతకు ముందు, కేరళ నుంచి విజయవాడ చేరుకున్న చంద్రబాబు నేరుగా ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని, ఘటన జరిగిన ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయాన్ని అధికారులు, ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుంచి నేరుగా ఆయన ఆంధ్ర ఆసుపత్రికి చేరుకున్నారు.
Chandrababu
ap cm
vijayawada boat accident

More Telugu News