actress namitha: వీర్ కు నేను ఓకే చెప్పడానికి కారణం ఇదే: నమిత

  • తమది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం
  • తమ అభిరుచులు, అభిప్రాయాలు ఒకటే
  • మూడు నెలల్లో వీర్ ను చాలా అర్థం చేసుకున్నా
ప్రముఖ సినీ నటి నమిత ఈనెల 24న తన ప్రియుడు వీరేంద్ర చౌదరిని పెళ్లాడబోతోంది. వీరి వివాహం తిరుపతిలో జరగనుంది. ఈ సందర్భంగా నమిత మాట్లాడుతూ, తన భర్త గురించి, తమ ప్రేమ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

వీరు తనకు బెస్ట్ ఫ్రెండ్ అని... అతను నిర్మాత, మంచి నటుడు అని నమిత తెలిపింది. తమది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అని చెప్పింది. తమ కామన్ ఫ్రెండ్ శశిధర్ 2016లో తనకు వీర్ ను పరిచయం చేశాడని... అలా తమ మధ్య స్నేహం ప్రారంభమైందని తెలిపింది. 2017 సెప్టెంబర్ 6న బీచ్ లో క్యాండిల్ లైట్ డిన్నర్ ను ఏర్పాటు చేసి, వీర్ తనకు ప్రపోజ్ చేశాడని వెల్లడించింది.

అలాంటి సర్ ప్రైజ్ ను తాను ఊహించలేదని... అయితే, తమ అభిరుచులు, అభిప్రాయాలు ఒకటే కావడంతో... వీర్ ప్రపోజల్ కు ఓకే చెప్పేశానని తెలిపింది. ఈ మూడు నెలల కాలంలో వీర్ ను తాను ఎంతో అర్థం చేసుకున్నానని చెప్పింది. వాస్తవానికి మగవాళ్ల పట్ల తనకు నమ్మకం పోయిందని... కానీ, వీర్ ను చూసిన తర్వాత పోయిన నమ్మకం మళ్లీ కలిగిందని తెలిపింది.
actress namitha
namitha
namitha marriage
tollywood

More Telugu News