MS Dhoni: ఇకపై ధోనీ భిన్నమైన శైలిలో ఆడాలి: గంగూలీ సలహా

  • ధోనీని స్వేచ్ఛగా ఆడనివ్వాలి
  • ఈ విషయంలో అతనితో మేనేజ్ మెంట్, కోహ్లీ మాట్లాడాలి
  • సెలెక్టర్లు కూడా ధోనికి సహకరించాలి
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. రిటైర్మెంట్ తీసుకునే సమయం ధోనీకి ఆసన్నమైందని మాజీ క్రికెటర్లు కూడా కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో ధోనీ ఆటతీరుపై మాజీ కెప్టెన్ గంగూలీ స్పందించాడు. టీ20ల్లో ఇకపై ధోనీ భిన్నంగా ఆడాలని దాదా అన్నాడు.

 ధోనీలో సామర్థ్యానికి కొదవలేదని... భిన్నంగా బ్యాటింగ్ చేస్తే కచ్చితంగా సక్సెస్ అవుతాడని తెలిపాడు. ఈ విషయంపై ధోనీతో టీమ్ మేనేజ్ మెంట్, కెప్టెన్ కోహ్లీ ప్రత్యేకంగా మాట్లాడాలని అన్నాడు. వన్డేలో సాధించిన రికార్డులతో పోలిస్తే, టీ20ల్లో ధోనీ రికార్డు బాగోలేదని తెలిపాడు. ధోనీని స్వేచ్ఛగా ఆడనివ్వాలని, ఇందుకోసం సెలెక్టర్లు కూడా సహకరించాలని చెప్పాడు. ధోనీకి స్వేచ్ఛను కలిగిస్తే, అతనిలో మరో ధోనీని చూస్తామని తెలిపాడు.
MS Dhoni
sourav ganguly
team india
kohli

More Telugu News