ys jagan: ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో అవసరమా?: జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన యనమల

  • దోచుకున్న సొమ్మును కాపాడుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చారు
  • జగతి పబ్లికేషన్స్ విషయంలో క్విడ్ ప్రోకో జరిగింది 
  • సీఎం కావాలని జగన్ కలలు కంటున్నారు 
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ ఆర్థిక మంత్రి యనమల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న సొమ్మును కాపాడుకోవడానికే జగన్ రాజకీయాల్లోకి వచ్చారని ఆరోపించారు. నల్ల ధనాన్ని జగన్ విదేశాలకు పంపించారని... వాటిని తిరిగి పెట్టుబడుల రూపంలో ఇక్కడకు తీసుకొచ్చి సాక్షి పేపర్ ను పెట్టారని అన్నారు. జగతి పబ్లికేషన్స్ విషయంలో క్విడ్ ప్రోకో జరిగిందనే విషయం తేలిపోయిందని చెప్పారు.

అధికారంలోకి రావాలని, సీఎం కావాలని జగన్ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రపంచ ఆర్థిక నేరగాళ్ల జాబితాలో జగన్ పేరు ఉండటంతో... రాష్ట్ర పరువు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం అవసరమా? అని మంత్రి ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. జగన్ పై వస్తున్న కొత్త ఆరోపణలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్యారడైజ్ పేపర్లలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేరు కూడా ఉందని అన్నారు.
ys jagan
YSRCP
yanamala
Telugudesam

More Telugu News