Prakash Raj: ఈ కారణం వల్లే నేను రాజకీయాల్లోకి రావడం లేదు: ప్రకాశ్ రాజ్

  • సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వస్తే.. దేశం నాశనం అవుతుంది
  • నటులు పార్టీలు పెట్టడాన్ని సమర్థించను
  • నటులకు కులమతాలకు అతీతంగా అభిమానులు ఉంటారు
ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమావాళ్లు రాజకీయాల్లోకి వస్తే, దేశం నాశనం అవుతుందని ఆయన అన్నారు. ఈ కారణం వల్లే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. సినీ నటులు రాజకీయాల్లోకి ప్రవేశించడం, రాజకీయ పార్టీలను పెట్టడాన్ని తాను సమర్థించనని తెలిపారు.

బెంగళూరులో ఈ రోజు ఓ కార్యక్రమానికి హాజరైన ప్రకాశ్ రాజ్... అక్కడ ప్రసంగిస్తూ ఈ మేరకు స్పందించారు. సినీ నటులకు కులమతాలకు అతీతంగా అభిమానులు ఉంటారని... రాజకీయాల్లోకి ప్రవేశిస్తే కొన్ని వర్గాల ప్రజలు తమకు దూరమవుతారని అన్నారు. అభిమానుల పట్ల బాధ్యతతో ప్రవర్తించాలనుకునే నటులు ఎవరైనా సరే రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు.
Prakash Raj
tollywood

More Telugu News