ముంబైలో నాలుగు లగ్జరీ ఫ్లాట్లు కొనుగోలు చేసిన అక్షయ్ కుమార్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముంబైలో నాలుగు లగ్జరీ ఫ్లాట్లు కొనుగోలు చేసిన అక్షయ్ కుమార్!

  • అంధేరీలో ఫ్లాట్లు కొనుగోలు చేసిన అక్షయ్ కుమార్ 
  • ఒక్కో ఫ్లాట్ ధర 4.5 కోట్ల రూపాయలు
  • ఇప్పటికే ముంబైలో పలు చోట్ల ఫ్లాట్లు 
బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ముంబైలోని అంధేరి ప్రాంతంలో నాలుగు ఫ్లాట్స్‌ ను ఒకేసారి కొనుగోలు చేయడం బాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది. అక్షయ్ భార్య ట్వింకిల్‌ ఖన్నా, కుమారుడు ఆరవ్‌, కుమార్తె నటాషాలతో కలిసి జుహులోని డ్యూప్లెక్స్‌ అపార్ట్‌ మెంట్‌ లో ఆయన నివాసం ఉంటున్నాడు. అది మాత్రమే కాకుండా ఆయనకు లోఖండ్ వాలా, బాంద్రాలలో కూడా ఫ్లాట్స్‌ ఉన్నాయి.

కొనేళ్ల క్రితం గోవాలోని అంజున బీచ్ ప్రాంతంలో కూడా ఒక భవనాన్ని కొనుగోలు చేశారు. తాజాగా కొనుగోలు చేసిన ఈ నాలుగు లగ్జరీ ఫ్లాట్లను అక్షయ్ కుమార్ భాటియా పేరుతో బాంద్రా రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో రిజిస్టర్‌ చేయించారని తెలుస్తోంది. వీటి ధర 18 కోట్ల రూపాయలని, ఒక్కో ఫ్లాట్ విలువ 4.5 కోట్ల రూపాయలని బాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. కాగా, ప్రస్తుతం అక్షయ్ కుమార్ ‘ప్యాడ్‌ మ్యాన్‌’, ‘2.ఓ’, ‘గోల్డ్‌’ అనే సినిమాలో నటిస్తున్నాడు. 
akshay kumar
luxury flats
bandra
mumbai

More Telugu News