lover police complaint: ఆమె కోసం విదేశీ ఉద్యోగం కూడా వదులుకున్నాను...ఇప్పుడొద్దంటోందంటూ కేసు నమోదు చేయమన్న యువకుడు!

  • ప్రియురాలు మోసం చేసిందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు 
  • యువతి వద్దందని విదేశీ ఉద్యోగావకాశాన్ని కూడా వదులుకున్నాడట 
  • రెండు కుటుంబాలు అంగీకరించిన తరువాత ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తోందని ఫిర్యాదు
హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులను ఓ యువకుడు చిత్రమైన సమస్యతో ఆశ్రయించాడు... దాని వివరాల్లోకి వెళ్తే... ఫిలింనగర్‌ లోని దుర్గాభవాని నగర్‌ లో ఎలక్ట్రీషియన్ గా పని చేస్తున్న జామ మహేష్‌ (24) అనే యువకుడు, రెండేళ్లుగా అదే ప్రాంతంలో నివసిస్తున్న యువతి (22) ని ప్రేమిస్తున్నాడు. వారి ప్రేమ విషయం తెలిసిన ఆ ఇద్దరి కుటుంబాలు వారి వివాహానికి అంగీకరించాయి.

అయితే ఏం జరిగిందో కానీ ఇప్పుడా యువతి మహేష్ ను వివాహం చేసుకునేందుకు నిరాకరిస్తోంది. దీంతో ఆ యువకుడు షాక్ తిన్నాడు. బతిమాలినా ఒప్పుకోవడం లేదంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఆమె కోసం తాను ఎన్నో త్యాగాలు చేశానని, విదేశాల్లో ఉద్యోగం వచ్చినా కూడా ఆమె వద్దనడంతో మానుకున్నానని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.
lover police complaint
banjara hills
polica station
case

More Telugu News