Rashikhanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • గాయనిగా జోరు పెంచిన రాశిఖన్నా 
  • 'హేయ్.. పిల్లగాడ' అంటున్న సాయి పల్లవి  
  • 'బాలకృష్ణుడు' పాటలు వచ్చేశాయ్ 
  • బల్గేరియా నుంచి లండన్ కు పవన్

*  అందాల రాశిఖన్నాలో మంచి గాయని కూడా వుంది. ఇప్పటికే రెండు మూడు సినిమాలలో ఈ చిన్నది సరదాగా పాటలు పాడింది. తాజాగా 'జవాన్' చిత్రంలో పాట పాడిన రాశి, 'బాలకృష్ణుడు' చిత్రంలో కూడా ఓ పాట పాడిందట. ఈ విషయాన్ని తనే వెల్లడిస్తూ, మణిశర్మ సంగీతంలో పాడిన ఈ పాట అందరినీ అలరిస్తుందని చెప్పింది.
*  దుల్కర్ సల్మాన్, సాయిపల్లవి జంటగా మలయాళంలో వచ్చిన 'కలి' చిత్రాన్ని 'హేయ్.. పిల్లగాడ' పేరిట తెలుగులోకి డబ్ చేశారు. ఈ నెల 24న ఈ తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు. మలయాళంలో ఈ చిత్రం 27 కోట్లకు పైగా వసూలు చేసి సంచలన విజయాన్ని సాధించింది.
*  నారా రోహిత్, రెజీనా జంటగా పవన్ మల్లెల దర్శకత్వంలో రూపొందుతున్న 'బాలకృష్ణుడు' చిత్రం ఆడియో వేడుక నిన్న రాత్రి హైదరాబాదులో జరిగింది. ఆడియో సీడీలను సమంత విడుదల చేయగా, తొలి సీడీని సాయిధరం తేజ్ అందుకున్నాడు.  
*  పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న 'అజ్ఞాతవాసి' చిత్రం షూటింగ్ ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 15తో ఆ షూటింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత పవన్ అక్కడి నుంచి లండన్ వెళ్లి హౌస్ ఆఫ్ లార్డ్స్ లో జరిగే కార్యక్రమంలో 'ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం ఎక్స్ లెన్స్' అవార్డును స్వీకరిస్తారు.

More Telugu News