దోమలు, పురుగులు ఎక్కువగా ఉండటంతో 'మిస్టర్‌ సి' చాలా ఇబ్బంది పడుతున్నారు: ఉపాస‌న
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దోమలు, పురుగులు ఎక్కువగా ఉండటంతో 'మిస్టర్‌ సి' చాలా ఇబ్బంది పడుతున్నారు: ఉపాస‌న

  • 'రంగస్థలం' సినిమా సెట్స్‌కి వెళ్లిన ఉపాస‌న
  • త‌న భ‌ర్తతో పాటు సినీ బృందం ప‌డుతోన్న క‌ష్టాన్ని చూసిన చెర్రీ భార్య‌
  • చివ‌రికి అభినంద‌న‌
మెగా హీరో రామ్‌చరణ్ తేజ్‌, ద‌ర్శ‌కుడు సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న‌ ‘రంగస్థలం’ సినిమాని ఓ ప‌ల్లెటూరు నేప‌థ్యంలో తీస్తోన్న విష‌యం తెలిసిందే.  తాజాగా చరణ్ భార్య ఉపాస‌న‌ ఆ సినిమా సెట్స్‌కి వెళ్లారు. రాత్రి వేళల్లో సినిమా షూటింగ్‌ జరుగుతోన్న స‌మ‌యంలో త‌న శ్రీవారిని దోమలు కుడుతున్నాయ‌ని ఆమె బాధపడుతోంది.

ఈ విషయం గురించి ఆమె ట్వీట్ చేస్తూ, ‘ఇప్పుడే సినిమా సెట్స్‌ నుంచి వచ్చాం. రాత్రివేళల్లో దోమలు, పురుగులు అధికంగా ఉండటంతో మిస్టర్‌ సి (చరణ్) చాలా బాధపడ్డారు. అయినా కూడా చ‌ర‌ణ్ స‌హా సినిమా యూనిట్ షూటింగ్‌ కోసం కష్టపడుతున్నారు. ఇది నిజంగా అభినందించాల్సిన విషయం’ అని పేర్కొంది.
  
upasana
Ramcharan
rangasthalam

More Telugu News