gst: వినియోగ‌దారుల‌కు ఊర‌ట‌.. కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న జీఎస్టీ కౌన్సిల్‌!

  • 28 శాతం శ్లాబులో ఉన్న 177 వస్తువులను ఆ శ్లాబు నుంచి తప్పిస్తూ నిర్ణయం 
  • 28 శాతం నుంచి 18 శాతం శ్లాబులోకి రానున్న చాలా వ‌స్తువులు
  • త‌గ్గ‌నున్న‌ షూ పాలిష్‌, డిటర్జెంట్‌, పోషకాహార పానీయాలు, కాస్మొటిక్స్ ధ‌ర‌లు
  • సిమెంట్‌, విలాస వస్తువులు, వాషింగ్‌ మెషీన్లు, పెయింట్స్ ధ‌ర‌ల్లో మార్పు లేదు

ఈ రోజు గౌహతిలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జ‌రిగింది. 28శాతం శ్లాబులో ఉన్న 177 వస్తువులను ఆ శ్లాబు నుంచి తప్పిస్తూ కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. దీంతో షూ పాలిష్‌, డిటర్జెంట్‌, పోషకాహార పానీయాలు, కాస్మొటిక్స్‌, చాక్లెట్లు, చూయింగ్‌గమ్‌లు, షాంపూలు, డియోడరెంట్‌ ల ధరలు దిగిరానున్నాయి.

జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశంలో పాల్గొన్న‌ బీహార్‌ ఆర్థికశాఖ మంత్రి సుశీల్‌ మోదీ తెలిపిన వివ‌రాల మేర‌కు..

  • ఇక‌పై 50 వస్తువులు మాత్రమే 28 శాతం శ్లాబులో
  • ఇప్ప‌టివరకు 227 వస్తువులు 28 శాతం శ్లాబులో
  • 62 వస్తువులను ఈ శ్లాబు నుంచి తొలగించాలని ఫిట్‌మెంట్‌ కమిటీ సిఫారసు
  • అంతకంటే ఎక్కువ వస్తువులను (177) 28 శాతం శ్లాబు నుంచి తొలగించిన జీఎస్టీ కౌన్సిల్‌
  • 28 శాతం నుంచి 18 శాతం శ్లాబులోకి రానున్న చాలా వ‌స్తువులు
  • సిమెంట్‌, విలాస వస్తువులు, వాషింగ్‌ మెషీన్లు, పెయింట్స్‌,  ఎయిర్‌ కండీషనర్లు మాత్రం 28 శాతం శ్లాబులోనే

More Telugu News