sharad paear: జస్టిస్‌ లోధా కమిటీ నివేదిక క్రికెట్‌ను సర్వ నాశనం చేసింది: శరద్‌ పవార్‌

  • బీసీసీఐలో పాల‌నా సంస్కరణ‌ల కోసం జస్టిస్‌ లోధా కమిటీ నివేదిక
  • మ‌రోసారి అసంతృప్తి వ్య‌క్తం చేసిన శ‌ర‌ద్ ప‌వార్‌
  • మీడియాతో మాట్లాడుతూ అస‌హ‌నం

బీసీసీఐలో పాల‌నా సంస్కరణ‌ల కోసం జస్టిస్‌ లోధా కమిటీ నివేదిక ఇచ్చిన నేప‌థ్యంలో ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఎన్‌సీపీ అధినేత, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ జస్టిస్‌ లోధా కమిటీ నివేదిక గురించి మాట్లాడుతూ.. అది క్రికెట్‌ను సర్వ నాశనం చేసిందని వ్యాఖ్యానించారు. తాజాగా విలేకరులు లోధా సిఫార్సులపై అడిగిన ప్రశ్నకు గాను శ‌ర‌ద్ ప‌వార్ ఈ విధంగా స‌మాధానం ఇచ్చారు.

ఈ ఒక్క వ్యాఖ్య‌తో ఆయ‌న‌కు ఈ నివేదిక‌ మీద ఎంత‌గా అసంతృప్తి ఉందో తెలిసిపోతోంది. ఐపీఎల్‌ స్ఫాట్‌ ఫిక్సింగ్‌పై జస్టిస్‌ ముకుల్‌ ముద్గల్‌ కమిటీ నివేదిక ఇవ్వ‌డంతో, బీసీసీఐలో సంస్కరణల కోసం 2015 జనవరిలో సుప్రీంకోర్టు జస్టిస్‌ లోధా కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక‌ను సుప్రీంకోర్టు ఆమోదించి, అమలు చేయమని బీసీసీఐని ఆదేశించింది.

More Telugu News