milka singh: మాజీ క్రికెటర్‌ మిల్కాసింగ్‌ మృతి!

  • స్టైలిష్‌ బ్యాట్స్‌మన్‌గా పేరు పొందిన ఏజీ మిల్కాసింగ్‌ (75)
  • అద్భుత ఫీల్డర్‌గా కూడా రాణింపు
  • ఆయన సోద‌రుడు కృపాల్ సింగ్‌ కూడా క్రికెట‌రే
  • 1960వ దశకంలో నాలుగు టెస్టులు ఆడిన‌ మిల్కాసింగ్  
స్టైలిష్‌ బ్యాట్స్‌మన్‌గా పేరు పొందిన టీమిండియా మాజీ క్రికెటర్‌ ఏజీ మిల్కాసింగ్‌ (75) గుండెపోటుతో ఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. బ్యాట్స్ మన్ గానే కాకుండా, అద్భుత ఫీల్డర్‌గా కూడా ఆయ‌న పేరుపొందారు. 17 ఏళ్ల‌కే మద్రాస్ టీమ్‌ తరఫున రంజీ ట్రోఫీలో ఆడారు.

ఎనిమిది సెంచ‌రీల‌తో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 4,000 పరుగులు చేశారు. ఆయన సోద‌రుడు కృపాల్ సింగ్‌ కూడా క్రికెట‌రే. 1960వ దశకంలో మిల్కాసింగ్ టీమిండియాలోకి ప్ర‌వేశించి నాలుగు టెస్టులు ఆడారు. ఆయన సోదరుడు కృపాల్‌సింగ్‌ 14 టెస్టుల్లో ఆడారు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసే మిల్కాసింగ్ త‌న సోద‌రుడు కృపాల్ సింగ్‌తో క‌లిసి కూడా టీమిండియాలో ఆడారు.  
milka singh
Cricketer
passed away

More Telugu News