sundeep kishan: ఏ గొడవనైనా ఎక్కువ కాలం మనసులో పెట్టేసుకోవడం నా వల్ల కాదు: సందీప్ కిషన్

  • 'రొటీన్ లవ్ స్టోరీ'కి ఓ నిర్మాతగా ఉందామనుకున్నాను 
  • నాన్న నుంచి డబ్బు తీసుకున్నాను 
  • ఆ సినిమా బడ్జెట్ విషయంలో గొడవలు 
  • నాన్న నష్టపోకూడదని ఆ డబ్బు తిరిగి ఇచ్చేశాను  
వైవిధ్యభరితమైన పాత్రలను చేస్తూ వెళుతోన్న యువ కథానాయకులలో సందీప్ కిషన్ పేరును ప్రధానంగా చెప్పుకోవచ్చు. తన కెరియర్లో జరిగిన కొన్ని సంఘటనలను గురించి, ఐడ్రీమ్స్ తో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన ప్రస్తావించాడు. " మా నాన్న అపార్ట్ మెంట్ అమ్మగా వచ్చిన 70 లక్షలతో 'రొటీన్ లవ్ స్టోరీ' సినిమాకి ఒక నిర్మాతగా వున్నాను. ఆ సినిమా దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో, బడ్జెట్ విషయంలో గొడవ వచ్చింది" అని అన్నాడు.

"అప్పటికి ఆయనకీ పెద్దగా అనుభవం లేకపోవడం వలన, బడ్జెట్ పెరిగిపోయింది. నా వలన నాన్న నష్టపోకూడదనే ఉద్దేశంతో తిరిగి ఆ డబ్బును ఆయనకి ఇచ్చేశాను. అలాగే 'రారా కృష్ణయ్య' సినిమా విషయంలోను ఓ డిస్కషన్ జరిగింది. అంతకి మించి ఎవరితోనూ ఎలాంటి గొడవలు లేవు. గొడవలను పెద్దవిగా చేయడం .. ఎక్కువ దూరం తీసుకెళ్లడం నాకు నచ్చదు. గొడవలను మనసులో పెట్టేసుకోవడం నా వల్ల కాదు .. ఏమున్నా అక్కడే మాట్లాడేస్తాను .. అంతే" అంటూ చెప్పుకొచ్చాడు.         
sundeep kishan

More Telugu News