germany: వైద్యం అంటే విసుగెత్తిందట.. ఏకంగా 106 మంది రోగులను చంపేసిన మగ నర్సు!

  • జర్మనీలోని డెల్మెన్‌ హోస్ట్‌ ఆసుపత్రిలో మేల్ నర్సుగా పని చేసిన నీల్స్ హోగెల్
  • 1999 నుంచి 2005 మధ్యలో 106 మందిని పొట్టన బెట్టుకున్నాడు  
  • ఒక రోగికి ప్రాణాంతక ఇంజెక్షన్ చేస్తుండగా చూసిన మరోనర్సు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది 

వైద్యం చేసి చేసి విసుగెత్తిపోయిన జర్మన్ కు చెందిన ఓ మేల్ నర్సు (మగ నర్సు) వందమందికి పైగా రోగులను పొట్టనబెట్టుకున్న ఘటనపై న్యాయస్థానం అతనికి జీవిత ఖైదు విధించింది. జర్మనీలోని డెల్మెన్‌ హోస్ట్‌ ఆసుపత్రిలో నీల్స్ హోగెల్ (41) అనే వ్యక్తి నర్సుగా పని చేస్తున్నాడు. అతను 2015లో ఓ ఇద్దరు రోగులపై హత్యాయత్నానికి పాల్పడి, మరో ఇద్దర్ని హతమార్చాడన్న కేసులో అరెస్టు అయ్యాడు. దీంతో ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు షాక్ తిన్నారు. తొలుత అతను 90 మందిని హతమార్చినట్టు గుర్తించారు.

 నేరం రుజువు కావడంతో న్యాయస్థానం అతనికి జీవిత ఖైదు ఖరారు చేసింది. ఆ తర్వాత మరికొందరు బాధితులు ఈ కేసు మరోసారి దర్యాప్తు చేయాలని కోరారు. దీంతో దీనిని మరోసారి దర్యాప్తు చేసిన పోలీసులు.. ఈసారి అతను మరో 16 మందిని హతమార్చినట్టు గుర్తించారు. దీంతో అతను మొత్తం 106 మందిని హతమార్చినట్టు నిర్ధారించారు. ఈ హత్యలన్నీ 1999 నుంచి 2005 మధ్యకాలంలో చేసినట్టు తెలిపారు. 2005లో ఒక రోగికి ప్రాణాంతక మందు ఇంజెక్ట్ చేస్తుండగా చూసిన మరో నర్సు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతనిని అరెస్టు చేశారు. వైద్యం అంటే విసుగు చెంది వారందర్నీ చంపేసినట్టు అతను తెలిపాడు.

More Telugu News