sundeep kishan: 'కేరాఫ్ సూర్య'తో తప్పకుండా హిట్ కొడతాను : సందీప్ కిషన్

  • కేరాఫ్ సూర్య'తో సందీప్ కిషన్ 
  • రేపే ప్రేక్షకుల ముందుకు 
  • కథానాయికగా మెహ్రీన్ 

సందీప్ కిషన్ కథానాయకుడిగా .. సుశీంద్రన్ దర్శకత్వంలో 'కేరాఫ్ సూర్య' చిత్రం తెరకెక్కింది. మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ .. స్నేహం అనే కోణంలో సాగే ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కిందని చెప్పాడు. ఈ సినిమాలో నేను పోషించిన 'సూర్య' పాత్ర నాకెంతో సంతృప్తిని ఇచ్చింది .. ఈ పాత్ర ఆడియన్స్ అందరికీ తప్పకుండా నచ్చుతుంది' అన్నాడు.

 మెహ్రీన్ పాత్ర చాలా ఫన్నీగా అనిపిస్తుంది .. ఈ సినిమాతో ఆమెకి తప్పకుండా మరో హిట్ పడుతుందని చెప్పాడు. 'తమిళంలో ఈ సినిమా ప్రివ్యూ వేసి చూపించాం .. అందరూ చాలా బాగుందన్నారు. తమిళంలోనే కాదు .. తెలుగులోను ఈ సినిమా హిట్ కొడుతుందనే నమ్మకం వుంది. ప్రస్తుతం చేతిలో ఓ నాలుగు సినిమాలు వున్నాయి .. ఇవన్నీ కూడా నా కెరియర్ కి బాగా హెల్ప్ అయ్యేవే' అంటూ చెప్పుకొచ్చాడు.        

More Telugu News