ఎన్నో కష్టాలు పడ్డాను .. అందుకే డబ్బుకు ప్రాధాన్యతనిస్తాను : రష్మీ
- వైజాగ్ నుంచి ఒంటరిగా ఇండస్ట్రీకి వచ్చాను
- ఆర్థికపరమైన ఇబ్బందులు వెంటాడాయి
- అయినా ఇంటి నుంచి సాయం ఆశించలేదు
- పారితోషికం ఎక్కువ ఇస్తే చిన్న హీరోతోనైనా చేస్తాను
"ఫస్టు చెక్ ను అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి అందుకున్నాను. ఆ డబ్బుతోనే ఇంటి అద్దె కట్టాను .. బ్యాంక్ ఎకౌంట్ ఓపెన్ చేశాను. ఇండస్ట్రీలో సక్సెస్ అయితే ఓకే .. లేదంటే ఇక్కడ సాయం చేసే వాళ్లు ఎవరూ వుండరు. కష్టాల్లో వున్నప్పుడు సాయం చేసేవారికన్నా .. ఆరా తీసే వాళ్లు ఎక్కువగా వుంటారు. ఇలాంటి పరిస్థితులు ఎదురుకావడం వల్లనే, నాకు డబ్బు విలువ తెలిసింది. అందువల్లనే నేను డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను. పారితోషికం ఎక్కువ ఇస్తానంటే చిన్న హీరోతో చేయడానికి కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు" అంటూ చెప్పుకొచ్చింది.