Narendra Modi: మరో సాహసోపేత నిర్ణయానికి మోదీ సిద్ధం.. గుజరాత్ ఎన్నికల తర్వాత ప్రకటన!

  • మోదీ మదిలో మరో కీలక ఆలోచన
  • దేశంలోని పన్నులన్నీ రద్దు.. ఇక ఉండేది ఒకటే
  • గుజరాత్ ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే ప్రకటన?

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో సాహసోపేత నిర్ణయానికి సిద్ధమవుతున్నారా? గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన వెంటనే మోదీ తన నిర్ణయాన్ని ప్రకటించాలని భావిస్తున్నారా? అవుననే అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం దేశంలో ఉన్న అన్ని పన్నులను రద్దు చేసి వాటి స్థానంలో ఒకే ఒక పన్నును అమలు చేసేందుకు మోదీ సిద్ధమైనట్టు చెబుతున్నారు. ఆదాయపన్ను సహా అన్నింటినీ రద్దు చేసి వాటి స్థానంలో బ్యాంకు లావాదేవీల పన్ను (బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ -బీటీటీ) విధించాలని మోదీ యోచిస్తున్నట్టు చెబుతున్నారు.

బీటీటీతోపాటు మద్యం, పొగాకు వంటి ప్రజల ఆరోగ్యానికి హాని చేసే వస్తువులపై వినియోగ పన్ను (కన్జంప్షన్ ట్యాక్స్) కూడా విధించాలన్నది మోదీ అభిప్రాయంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న విధానంలో పన్నుల వసూలు కోసం ప్రభుత్వం ప్రజల వెంట పడుతోంది. బీటీటీ కనుక అమల్లోకి వస్తే ఇక ఆ అవసరం ఉండదు. అటోమెటిక్‌గా పన్నులు వసూలవుతాయి. ఫలితంగా పన్ను ఎగవేతకు అవకాశం ఉండదు. సంస్థలు, వ్యక్తులు ఎవరిమధ్యనైనా ఎటువంటి లావాదేవీలు జరగాలన్నా రెండు శాతం ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో వెళ్లిపోతుంది. ఇలా సమకూరిన ఆదాయంలో కేంద్రానికి 0.7 శాతం, రాష్ట్రానికి 0.6 శాతం, స్థానిక సంస్థలకు 0.35 శాతం, లావాదేవీ జరిగిన బ్యాంకుకు 0.35 శాతం చొప్పున లభిస్తుంది.

ప్రధాని మోదీ ప్రవేశపెట్టాలని చూస్తున్న బీటీటీకి వాణిజ్య వర్గాలు కూడా మద్దతు పలుకుతున్నట్టు తెలుస్తోంది. మోదీకి నోట్ల రద్దు సలహా ఇచ్చిన పుణెకు చెందిన అర్థక్రాంతి ప్రతిష్ఠాన్ వ్యవస్థాపకుడు అనిల్ బోకిల్ తొలిసారి ఈ ప్రతిపాదన తెచ్చినట్టు తెలుస్తోంది.  

More Telugu News