ఎయిరిండియా విమానాలే ఎక్కండి: అధికారులకు హోం శాఖ ఆదేశాలు
- పీకల్లోతు కష్టాల్లో ఎయిర్ ఇండియా
- అప్పులను తగ్గించేందుకు ఇప్పటికే ప్రైవేటీకరణకు గ్రీన్ సిగ్నల్
- అధికారులంతా ఏఐ విమానాలు ఎక్కండి
- హోం శాఖ కీలక సూచన
అధికారుల పర్యటనల ఖర్చును ప్రభుత్వమే భరిస్తోందని గుర్తు చేస్తూ, ఏఐలో ప్రయాణించడం వల్ల సంస్థకు లాభదాయకమని పేర్కొంది. ఈ ఆదేశాలను పాటించకుండా, ఇతర ప్రైవేటు ఎయిర్ లైన్స్ విమానాల్లో ప్రయాణిస్తే, చర్యలు ఉంటాయని తెలిపింది. ముఖ్యంగా హోం శాఖ కింద పనిచేస్తున్న వారంతా ఈ నిర్ణయాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. కాగా, ఎయిర్ ఇండియాలోని రుణభారాన్ని తగ్గించే లక్ష్యంతో కొంత వాటాను ప్రైవేటుకు అప్పగించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే.