air india: ఎయిరిండియా విమానాలే ఎక్కండి: అధికారులకు హోం శాఖ ఆదేశాలు

  • పీకల్లోతు కష్టాల్లో ఎయిర్ ఇండియా
  • అప్పులను తగ్గించేందుకు ఇప్పటికే ప్రైవేటీకరణకు గ్రీన్ సిగ్నల్
  • అధికారులంతా ఏఐ విమానాలు ఎక్కండి
  • హోం శాఖ కీలక సూచన

పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను ఆదుకునే దిశగా కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు అధికారిక పర్యటనలకు వెళ్లిన వేళ, ఎయిర్ ఇండియాలో మాత్రమే ప్రయాణించాలని సూచించింది. ఆ టికెట్లను కూడా ఎయిర్ ఇండియా అధికారిక వెబ్ సైట్ నుంచి లేదా, అధీకృత ట్రావెల్ ఏజంట్ల నుంచి కొనాలని, ఇతర వెబ్ సైట్ల నుంచీ వద్దని తెలిపింది.

అధికారుల పర్యటనల ఖర్చును ప్రభుత్వమే భరిస్తోందని గుర్తు చేస్తూ, ఏఐలో ప్రయాణించడం వల్ల సంస్థకు లాభదాయకమని పేర్కొంది. ఈ ఆదేశాలను పాటించకుండా, ఇతర ప్రైవేటు ఎయిర్ లైన్స్ విమానాల్లో ప్రయాణిస్తే, చర్యలు ఉంటాయని తెలిపింది. ముఖ్యంగా హోం శాఖ కింద పనిచేస్తున్న వారంతా ఈ నిర్ణయాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. కాగా, ఎయిర్ ఇండియాలోని రుణభారాన్ని తగ్గించే లక్ష్యంతో కొంత వాటాను ప్రైవేటుకు అప్పగించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే.

More Telugu News