Fake news: ఫేక్ న్యూస్‌పై యుద్ధం ప్రకటించిన కేంద్రం.. అటువంటి సంస్థలకు ప్రకటనలు బంద్!

  • తప్పుడు కథనాలకు కేంద్రం చెక్
  • ప్రకటనలు ఆపేసి ఆర్థికంగా దెబ్బ కొట్టాలని వ్యూహం
  • ఫేక్ న్యూస్‌పై ప్రెస్‌కౌన్సిల్‌కు ఫిర్యాదు

మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలపై పోరుకు కేంద్రం నడుం బిగించింది. అటువంటి కథనాలు ప్రచురిస్తున్న మీడియా సంస్థలకు ప్రకటనలు నిలిపివేయడం ద్వారా వాటికి అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. 2016లో తీసుకొచ్చిన ప్రింట్ మీడియా కొత్త చట్టంలోని 25 క్లాజ్‌ను ఆయుధంగా చేసుకుని తప్పుడు వార్తలకు చెక్ చెప్పాలని యోచిస్తోంది.

మీడియాలో తప్పుడు కథనాలు, దురుద్దేశపూరిత అవాస్తవ కథనాల ప్రచురణ ఎక్కువ కావడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇకపై ఇటువంటి వార్తలపై ప్రెస్ కౌన్సిల్‌ను ఆశ్రయించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘ఫేక్ న్యూస్’ను ప్రచురించే మీడియా సంస్థలకు ప్రకటనలు ఆపివేయడం ద్వారా ప్రభుత్వం ఆర్థికంగా వాటిని దెబ్బకొట్టనుంది. తద్వారా అటువంటి వార్తలకు చెక్ పెట్టాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. కాగా,  ఈ ఏడాది ‘ఫేక్ న్యూస్’ అనే పదం వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.

More Telugu News