ఆవిష్కరణకు ముందే 300ల ఐఫోన్ ఎక్స్ ఫోన్లను కొట్టేసిన దుండగులు
- ఆపిల్ స్టోర్‌లోనే దొంగతనం
- డెలివరీకి సిద్ధంగా ఉన్న ఫోన్ల చోరీ
- దాదాపు రూ. 2.40 కోట్ల విలువైన ఫోన్లు
డెలివరీకి సిద్ధంగా ఉన్న 313 ఆపిల్ ఐఫోన్ ఎక్స్ ఫోన్లలో 300ల ఫోన్లను ఈ ముగ్గురు దొంగలు స్టోర్ బయట పార్క్ చేసి ఉన్న డెలివరీ వ్యాన్ నుంచి కొట్టేశారు. వీటి విలువ దాదాపు 3,70,000 డాలర్ల విలువ (దాదాపు రూ. 2.40 కోట్లు) ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డెలివరీ సంస్థ యూపీఎస్ వెల్లడించింది. 'ఆపిల్ ఐఫోన్ ఎక్స్' భారత్ సహా ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఇవాళ్టి నుంచి మార్కెట్లోకి రానుంది.