distance education: కరస్పాండెన్స్ ద్వారా సాంకేతిక విద్య చెల్లదు: సుప్రీంకోర్టు కీలక రూలింగ్

  • దూర విద్యా విధానంలో టెక్నికల్ కోర్సులు ఎలా నేర్చుకుంటారు?
  • ఇది క్లాసులకు రాకుండా నేర్చుకునే విద్య కాదని వ్యాఖ్య 
  • ఒడిశా హైకోర్టు తీర్పు చెల్లదని స్పష్టం చేసిన అత్యున్నత న్యాయస్థానం 

కరస్పాండెన్స్ విధానంలో టెక్నికల్ కోర్సులను నేర్చుకోవడం చెల్లదని సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం కీలక రూలింగ్ ఇచ్చింది. ఇంజనీరింగ్ ను దూర విద్యా విధానంలో నేర్చుకోలేమని అభిప్రాయపడ్డ సుప్రీంకోర్టు, గతంలో ఈ విషయంలో ఒడిశా హైకోర్టు ఇచ్చిన తీర్పు చెల్లదని పేర్కొంది. టెక్నికల్ ఎడ్యుకేషన్ ను దూర విద్య ద్వారా నేర్చుకోవచ్చని ఒడిశా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది.

ఇదే సమయంలో దూరవిద్యా విధానంలో సాంకేతిక కోర్సులను అనుమతించ వచ్చని పంజాబ్ హర్యానా కోర్టు చేసిన వ్యాఖ్యలనూ తప్పుబట్టింది. కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సులను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానంలో ఎలా నేర్చుకోవచ్చో తెలియడం లేదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సాంకేతికతతో కూడిన కోర్సులు, రెగ్యులర్ క్లాసులకు హాజరు కాకుండా, ప్రాక్టికల్స్ చేయకుండా కేవలం చదువుకుని నేర్చుకునే విద్యలు కాదని పేర్కొంది.

More Telugu News