old currency: పాత నోట్లపై కేంద్రం మరో కీలక ప్రకటన!

  • పాత నోట్లను కలిగి ఉన్నవారిపై చర్యలు తీసుకోము
  • సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నాకే చర్యలు
  • సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపిన కేంద్రం

రద్దయిన పాత నోట్ల గురించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. పాత రూ. 500, రూ. 1000 కరెన్సీ నోట్లను కలిగిఉన్న వారిపై ఎలాంటి క్రిమినల్ చర్యలను తీసుకోబోమని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. సుప్రీంకోర్టు దీనిపై తుది నిర్ణయం ప్రకటించేంత వరకు తాము ఎలాంటి చర్యలు తీసుకోమని స్పష్టం చేసింది. పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయని వారిపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కోరుతూ సుధామిశ్రా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు నేడు విచారించింది. ఈ సందర్భంగా కేంద్రం ఈమేరకు సుప్రీంకోర్టుకు తెలిపింది.

రద్దయిన నోట్లను కలిగి ఉంటే భారీ జరిమానాలు తప్పవని గతంలో కేంద్రం హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఒక వ్యక్తి వద్ద గరిష్టంగా పది రద్దయిన నోట్ల వరకు మాత్రమే ఉండాలనే ఆర్డినెన్స్ ను కూడా కేంద్రం తీసుకొచ్చింది. అంతకంటే ఎక్కువ మొత్తంలో నోట్లు ఉంటే క్రిమినల్ నేరంగా పరిగణిస్తామని పేర్కొంది.

More Telugu News