morning walk: మార్నింగ్ వాక్ కు వెళ్లకండి... ఢిల్లీ వాసులకు వైద్యుల హెచ్చరిక!

  • మార్నింగ్ వాక్, జాగింగ్ మంచిది కాదన్న వైద్యులు
  • ఢిల్లీలో ఉదయంపూట గాలిలో 2.5 శాతం దుమ్ము, ధూళి కణాలు ఉన్నాయి
  • మార్నింగ్ వాక్, జాగింగ్ చేస్తే ఊపిరితిత్తుల సమస్యలు

పట్టణ ప్రజలు ఆరోగ్య సంరక్షణ కోసం మార్నింగ్ వాక్, జాగింగ్, యోగ, ధ్యాన చేయడం సర్వసాధారణమన్న సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ వాసులను మాత్రం మార్నింగ్ వాక్, జాగింగ్ చేయవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ శ్వాస ప్రధానమైన వ్యాయామాలు కావడంతో వైద్యులు ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనికి కారణమేంటంటే... దేశంలోనే అత్యంత కాలుష్యకారక నగరమైన ఢిల్లీలో ఉదయం వేళల్లోనే దుమ్ము ధూళి కణాల శాతం 2.5గా నమోదవుతోందట.

ఈ నేపథ్యంలో వాకింగ్, జాగింగ్ చేయడం వల్ల వచ్చే ఆరోగ్యం సంగతి దేవుడెరుగు, అనారోగ్యం బారినపడుతున్నారని, అందుకే ఉదయం పూట గాలి తాజాగా ఉంటుందని భావించి బయట వాకింగ్, జాగింగ్ చేయవద్దని సూచిస్తున్నారు. ఊపిరితిత్తులకు ముప్పుగా మారే కాలుష్య కారకాలు ఢిల్లీలోని గాలిలో ఉన్నాయని వారు తెలిపారు.

మార్నింగ్ వాక్, జాగింగ్ వల్ల ఊపిరితిత్తుల పనిసామర్థ్యం తగ్గిపోవడం తథ్యమని వారు హెచ్చరించారు. తమ వద్దకు శ్వాస సంబంధ సమస్యలతో వస్తున్న చాలా మంది బాధితులు మార్నింగ్ వాక్ లేదా జాగింగ్ అలవాటు ఉన్నవారేనని వారు తెలిపారు. అందుకే ఉదయంపూట వాకింగ్, జాగింగ్ కు బయటకు రావద్దని వారు సూచించారు. 

More Telugu News