charan: 'స్పైడర్' నిర్మాతకి మాట ఇచ్చిన చరణ్?

  • 'రంగస్థలం' షూటింగులో బిజీగా చరణ్
  • తరువాత సినిమా కొరటాలతో 
  • 'స్పైడర్'తో నష్టపోయిన ఎన్వీ ప్రసాద్ 
  • ఆయన బ్యానర్లోను చరణ్
మహేశ్ బాబు .. మురుగదాస్ కాంబినేషన్లో ఇటీవల వచ్చిన 'స్పైడర్' సినిమా .. భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ఆ సినిమాపై భారీగా ఖర్చు చేసిన నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఇబ్బందుల్లో పడ్డారు. ఆ నష్టాల నుంచి బయటపడాలంటే ఆయన మరో స్టార్ హీరోతో సినిమా చేయవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయన చరణ్ ను కలవగా ఓ సినిమా చేసి పెడతానని మాట ఇచ్చాడట.

చరణ్ వరుస పరాజయాలతో వున్నప్పుడు ఆయనకి 'ధ్రువ' సినిమా ఘన విజయాన్ని అందించింది. ఆ సినిమాను అల్లు అరవింద్ తో కలిసి నిర్మించినది ఎన్వీ ప్రసాదే. తనకి సక్సెస్ ఇచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకున్న చరణ్, ఆయన బ్యానర్లో మరో సినిమా చేస్తాననీ .. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోమని చెప్పాడట. దాంతో ఎన్వీ ప్రసాద్ కి కాస్త ఊరట లభించిందని అంటున్నారు. 'రంగస్థలం' తరువాత కొరటాల దర్శకత్వంలో చరణ్ సినిమా ఉండనుంది. ఆ తరువాత సినిమా ఎన్వీ ప్రసాద్ బ్యానర్లో ఉండొచ్చని చెప్పుకుంటున్నారు.    
charan

More Telugu News