airtel: 3జీ సేవలను విరమించుకోబోతున్న ఎయిర్ టెల్

  • 3జీ సేవలను రద్దు చేయనున్న ఎయిర్ టెల్
  • 4జీ పైనే ఎక్కువ పెట్టుబడులు
  • 3 నుంచి 4 ఏళ్లలో 3జీ బంద్
భారత టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ తన 3జీ సర్వీసులకు మంగళం పలకబోతోంది. రానున్న 3 నుంచి 4 ఏళ్లలో 3జీ సేవలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. వాటి స్పెక్ట్రమ్ లను 4జీ సర్వీసులకు జత చేస్తామని వెల్లడించింది. ఇప్పటికే 3జీ సర్వీసులపై ఎలాంటి ఖర్చులు చేయడం లేదని ప్రకటించింది. తమ నెట్ వర్క్ లో డేటా సామర్థ్యాన్ని మరింత అభివృద్ది చేయడం కోసం 4జీ టెక్నాలజీపై ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నట్టు భారతీ ఎయిర్ టెల్ దక్షిణాసియా, ఇండియా సీఈవో, ఎండీ గోపాల్ విట్టల్ తెలిపారు.

ప్రస్తుతం 3జీ, 4జీ సర్వీసుల కోసం 2100 మెగా హెర్ట్జ్ బ్యాండ్ లను వాడుతున్నామని... తమ స్పెక్ట్రమ్ లో ఎక్కువ భాగాన్ని 4జీ సర్వీసులకే కేటాయిస్తున్నామని ఆయన చెప్పారు. కొన్ని టెలికాం సర్కిళ్లలో అత్యాధునిక 3జీ పరికరాలను అమరుస్తున్నామని... అవి 4జీకి సపోర్ట్ చేస్తాయని తెలిపారు. ఈ పరికరాలను తర్వాత రీప్లేస్ చేస్తామని చెప్పారు.
airtel
3g
4g
airtel 3g services
airtel 4g services

More Telugu News