Kidambi Srikanth: బ్యాడ్మింటన్ స్టార్ శ్రీకాంత్ ఇక డిప్యూటీ కలెక్టర్!

  • శ్రీకాంత్‌పై కాసుల వర్షం..
  • రూ. 2 కోట్ల నజరానా.. అమరావతిలో స్థలం
  • ఏపీ మంత్రి మండలి నిర్ణయం

వరుస విజయాలతో దూసుకుపోతున్న బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం కిడాంబి శ్రీకాంత్‌పై కాసుల వర్షం కురుస్తోంది. డెన్మార్క్ ఓపెన్ నెగ్గిన వారం రోజులకే ఫ్రెంచ్ ఓపెన్‌ను కూడా సొంతం చేసుకున్న శ్రీకాంత్‌ను ఏపీ మంత్రి మండలి అభినందించింది. బుధవారం సమావేశమైన మంత్రి మండలి శ్రీకాంత్‌కు అమరావతిలో వెయ్యి గజాల స్థలం ఇవ్వడంతోపాటు గ్రూప్-1 అధికారి (డిప్యూటీ కలెక్టర్)గా ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. అతడి కోచ్ పుల్లెల గోపీచంద్‌కు రూ. 15 లక్షలు, ఎలైట్ లెవెల్ కోచ్ సుధాకర్‌రెడ్డికి రూ. 11. 25 లక్షలు, మరో కోచ్ శ్రీకాంత్‌కు రూ. 3.75 లక్షలు ఇవ్వాలని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించారు.

విజయాలను అలవాటుగా మార్చుకున్న శ్రీకాంత్ ఈ ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లను గెలుచుకుని ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమ ఆటగాళ్లు అయిన లీ చాంగ్ వీ, లిన్ డాన్, చెన్ లాంగ్ సరసన నిలిచాడు. అద్భుత విజయాలతో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న శ్రీకాంత్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాని మంత్రి మండలి ఆకాంక్షించింది.

More Telugu News