యాప్ ద్వారా టాలెంట్ సెర్చ్ పరీక్ష... అమలు చేయనున్న కేంద్రం
- నవంబర్ 26న జరగనున్న నేషనల్ టాలెంట్ సెర్చ్ పరీక్ష
- నమోదు చేసుకున్న 91వేల మంది విద్యార్థులు
- దేశవ్యాప్తంగా 2078 సెంటర్లలో పరీక్ష
- ప్రపంచంలోనే మొదటిసారి
ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్టోర్ల నుంచి వీవీఎం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత వారికి కేటాయించిన పరీక్షా కేంద్రానికి వెళ్లి విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్ష మొదలవగానే స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లలోని ఇతర యాప్‌లు పనిచేయకుండా వీవీఎం యాప్ నియంత్రిస్తుంది. దీంతో పరీక్షలో కాపీ కొట్టే అవకాశం ఉండదు. ఈ పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థులను ప్రభుత్వం తరఫున దేశ, విదేశాల్లోని విజ్ఞాన ప్రదర్శన కేంద్రాలకు తీసుకువెళ్తామని శాస్త్రవేత్త అరవింద్ రనడే తెలిపారు. అంతేకాకుండా నగదు బహుమతులు కూడా అందజేస్తామని పేర్కొన్నారు.