qualcomm: ప్రపంచపు తొలి 5జీ ఫోన్ ఇదే... ఫొటో షేర్ చేసిన క్వాల్ కామ్ ఉద్యోగి!

  • ఒక సెకనుకు గిగాబైట్ డేటా ట్రాన్స్ ఫర్
  • తయారు చేసిన క్వాల్ కామ్
  • స్నాప్ డ్రాగన్ ఎక్స్ 50 మోడెమ్ చిప్ సెట్

2జీ, 3జీ అన్న మాట మరిచి 4జీ వాడుతున్న రోజులివి. ఇక త్వరలోనే 4జీ కూడా మాయమై, సెకనుకు 1 జీబీ డేటాను బట్వాడా చేసే సామర్థ్యాన్ని కలిగివుండే 5జీ ఫోన్ వచ్చేస్తోంది. ఇప్పటికింకా 5జీ నెట్ వర్క్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానేలేదు, అప్పుడే చాలా సంస్థలు 5జీ స్మార్ట్ ఫోన్ ను తయారు చేస్తున్నాయి. వాటిల్లో క్వాల్ కామ్ కూడా ఉంది.

 స్నాప్ డ్రాగన్ ఎక్స్ 50 మోడెమ్ చిప్ సెట్ తో తయారైన 5జీ ఫోన్ ను క్వాల్ కామ్ ఉద్యోగి ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అదిప్పుడు వైరల్ అవుతోంది. తన చేతిలో ప్రపంచపు మొట్టమొదటి 5జీ స్మార్ట్ ఫోన్ ఉందని, ఈ విషయాన్ని తానే నమ్మలేకున్నానని షరీఫ్ హన్నా అనే వ్యక్తి ఈ ఫొటోను షేర్ చేశాడు. తొలి 5జీ ఫోన్ ను మీరూ చూడవచ్చు.

More Telugu News