TRS: రాజేంద్రనగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ హల్‌చల్.. క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు

షార్ట్స్‌లో చూడండి
రాజేంద్రనగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. ప్రకాశ్ గౌడ్ హల్‌చల్ చేశారు. జి. మోహన్‌రెడ్డి అనే వ్యాపారవేత్తను కోటి రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అందుకు అతడు నిరాకరించడంతో ఆయన ఇంటికి చేరుకున్న ప్రకాశ్ గౌడ్ అనుచరులు ఇంటి ప్రహరీని కూల్చేశారు. చంపేస్తామని బెదిరించారు. దీంతో ప్రకాశ్‌గౌడ్‌పై బాధితుడు మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆక్రమణ, క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

ఈ క్రమంలో ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ, మోహన్‌రెడ్డి ప్రస్తుతం కలిగి ఉన్న భూమి ఒకప్పుడు నడకదారని, తిరిగి దానిని ఉపయోగంలోకి తీసుకురావాల్సిందిగా ప్రజలు తనను కోరారని చెప్పారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసుల సమక్షంలోనే ప్రహరీని కూల్చివేసినట్టు ప్రకాశ్ గౌడ్ పేర్కొన్నారు.

కాగా, ఎమ్మెల్యే, అతని అనుచరులు తన భూమిలోకి చొరబడడమే కాకుండా అక్కడి గార్డులను బెదిరించారని, జేసేబీతో గోడను కూల్చివేశారని మోహన్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజలు ఉపయోగించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలున్నా ఓ ప్రత్యేక ఎజెండాతోనే తనను బెదిరించారని మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రహరీని కూల్చేస్తున్నప్పుడు పోలీసులు కానీ, జీహెచ్ఎంసీ అధికారులు కానీ లేరని మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
Go Back to Shorts
TRS
MLA
Prakash Goud

More Telugu News