indrakeeladri: కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రసాదాలు, సేవా రుసుములు తగ్గింపు... కొత్త ధరలివి!

  • భక్తుల ఫిర్యాదులపై స్పందించిన పాలక మండలి
  • నేడు అత్యవసర సమావేశ నిర్వహణ
  • లడ్డూ ధర రూ. 5 తగ్గింపు
  • పార్కింగ్ ఫీజులో రూ. 10 తగ్గింపు

గత కొంతకాలంగా భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై స్పందించిన విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ దేవస్థాన పాలకమండలి సోమవారం నాడు అత్యవసర సమావేశం జరిపి పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. అమ్మవారి సన్నిధిలో ప్రసాదాలు, సేవా రుసుములు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. మారిన ధరల ప్రకారం, రూ. 20గా ఉన్న లడ్డూ ధర ఇకపై రూ. 15కు మారనుంది. కొండపై ద్విచక్ర వాహనాల పార్కింగ్ కు ప్రస్తుతం వసూలు చేస్తున్న రూ. 25ను రూ. 15కు తగ్గిస్తూ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. భక్తులను ఘాట్ రోడ్ మార్గంలో అనుమతిస్తామని, అతి త్వరలోనే రెండు మార్గాల గుండా భక్తుల రాకపోకలు ప్రారంభమవుతాయని వెల్లడించింది. ప్రత్యేక దర్శనం, అంతరాలయ దర్శనం, ఇతర సేవలు, ఇతర ప్రసాదాల రుసుములను కూడా తగ్గిస్తున్నట్టు పాలక మండలి ప్రకటించింది.

More Telugu News