balakrishna: గుర్రంపై నుంచి పడిపోతూ బాలకృష్ణ ఆ చిన్నారిని రక్షించారు : దర్శకుడు క్రిష్

  • బాలకృష్ణ కి హార్స్ రైడింగ్ బాగా తెలుసు 
  • ఒకేసారి రెండు బాంబులూ పేలాలి... పేలలేదు 
  • ఒక్కసారిగా గుర్రం బెదిరిపోయింది

క్రిష్ దర్శకత్వం వహించిన 'గౌతమీ పుత్ర శాతకర్ణి' భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో అనుకోకుండా జరిగిన ఒక సంఘటనను గురించి, తాజాగా ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిష్ చెప్పుకొచ్చారు. " బాలకృష్ణ కి హార్స్ రైడింగ్ బాగా తెలుసు .. యుద్ధంలో వాడటానికి ఆయనకి అరేబియన్ గుర్రాన్ని తెప్పించాం. దానిని చాలా హాలీవుడ్ మూవీస్ లోను ఉపయోగించారు. ముందురోజే వచ్చి బాలకృష్ణ ఆ గుర్రాన్ని మచ్చిక చేసుకున్నారు" అని చెప్పారు.

"ఇక షూటింగులో బాలకృష్ణ ఓ చిన్నారిని తీసుకుని గుర్రంపై వెళుతూ ఉండగా, ఆ దారికి రెండు వైపులా అమర్చబడిన బాంబులు ఒకేసారి పేలాలి. అప్పుడు గుర్రం మరింత వేగంగా ముందుకు వెళ్లడం చిత్రీకరించవలసి వుంది. కానీ అలా అమర్చబడిన వాటిలో గుర్రానికి కుడివైపునున్న బాంబ్ పేలింది గానీ .. ఎడమ వైపు బాంబ్ పేలలేదు.

 దాంతో గుర్రం బెదిరిపోయి ఎడమవైపుకు తిరిగిపోయింది .. అది దాని నైజం. ఆ కుదుపుకు బాలకృష్ణ గుర్రంపై నుంచి పడిపోతూ, ఆ చిన్నారికి ఎక్కడా దెబ్బ తగలకుండా గట్టిగా పొదివి పట్టుకున్నారు. ఆయన కిందపడిపోయి వున్నారు .. ఆ వెనుకే వంద గుర్రాలు వచ్చేస్తున్నాయి. జరగబోయేది గ్రహించిన హార్స్ ట్రైనర్ .. బాలయ్య ఉపయోగించిన గుర్రాన్ని వెంటనే వెనక్కి తిప్పి, అటుగా వస్తున్న గుర్రాలకి అడ్డుగా నిలపడంతో అవన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి" అలా తృటిలో ప్రమాదం తప్పిపోయిందని చెప్పుకొచ్చారు. 

More Telugu News