బస్సు ఒకటే... సగం ఏసీ, సగం నాన్ ఏసీ... ఏపీఎస్ ఆర్టీసీ కొత్త సర్వీసులు ప్రారంభం
- విజయవాడ - ఒంగోలు మధ్య కొత్త సర్వీసులు
- నేటి నుంచి ప్రారంభం
- ఆదరణను బట్టి మరిన్ని సర్వీసులన్న అధికారులు
ఏసీ కంపార్టుమెంటులో రెండు ఎల్ఈడీ టీవీలను అమర్చారు. ఏసీ ప్రయాణికులకు వాటర్ బాటిల్ ను కూడా అందించనున్నట్టు అధికారులు తెలిపారు. ముందువైపు సూపర్ లగ్జరీలో ఉన్నటు వంటి సీట్ల అమరిక ఉంటుంది. ఈ బస్సులను ప్రస్తుతం ప్రయోగాత్మకంగా నడుపుతున్నామని, ప్రయాణికుల నుంచి వచ్చే ఆదరణను చూసి మరిన్ని బస్సులను, ఇతర మార్గాల్లోనూ నడుపుతామని అధికారులు పేర్కొన్నారు.