నిండు ప్రాణాన్ని బలిగొన్న ప్రేమ వివాదం.. ఉరేసుకున్న ఇంజినీరింగ్ విద్యార్థిని
- బావతో పెళ్లి నిశ్చయించిన పెద్దలు
- అతడితో పెళ్లి కుదరదని, మర్చిపోవాలని సూచించిన ప్రియురాలు
- మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని
కాగా, ఇదే కాలేజీలో చదువుకుంటున్న మరో విద్యార్థిని, హరీష్ ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం ఆమె, శ్రీలక్ష్మి ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారు. హరీష్‌ను తాను ప్రేమించాను కాబట్టి అతడిని మర్చిపోవాలంటూ శ్రీలక్ష్మితో చెప్పింది. అయితే తాను బావనే పెళ్లి చేసుకుంటానని శ్రీలక్ష్మి తేల్చి చెప్పింది. దీంతో ఇద్దరూ ఈ విషయమై ఫోన్‌లోనే రెండు గంటలపాటు గొడవపడ్డారు. శనివారం ఉదయం శ్రీలక్ష్మి తన తల్లి, బావతో ఫోన్‌లో మాట్లాడింది. అనంతరం హాస్టల్‌కు చేరుకున్న శ్రీలక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.