gandhi hospital: గాంధీ ఆసుపత్రిలో సిబ్బంది రాసలీలలు... బయట తలుపులేసి పట్టించిన రోగుల బంధువులు!

  • బెదిరించి ఉద్యోగినిని లొంగదీసుకున్న సెక్యూరిటీ సూపర్ వైజర్
  • కలసి గదిలో ఉండగా చూసిన రోగుల బంధువులు
  • ఇద్దరినీ సస్పెండ్ చేసిన అధికారులు

గాంధీ ఆసుపత్రిలో రాసలీలలకు దిగిన ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులను రోగుల బంధువులు రెడ్ హ్యాండెడ్ గా పట్టించారు. సెక్యూరిటీ సూపర్ వైజర్ రాంకిలాన్ పాండే, ఓ మహిళ కలిసి రోగులకు కేటాయించే ఓ గదిలో ఉన్న సమయంలో, విషయం గమనించిన కొందరు బయట గడియ పెట్టి అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి తలుపులు తెరిపిస్తే, గదిలో పాండేతో పాటు మరో కాంట్రాక్టు ఉద్యోగిని ఉండటంతో ఇద్దరినీ విధుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు.

తనను విధుల నుంచి తొలగిస్తానని పాండే బెదిరించగా, భయంతో లొంగిపోయినట్టు సదరు ఉద్యోగిని వెల్లడించడం గమనార్హం. ఆసుపత్రిలో సర్వీస్ శానిటేషన్, పెస్ట్ కంట్రోల్, పేషెంట్ కేర్ విభాగాలను కాంట్రాక్టు పద్ధతిలో నిర్వహిస్తుండగా, ఈ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న వారిలో పలువురు ఆసుపత్రి సెల్లార్ లోని గదులు, ఖాళీగా ఉండే గదుల్లో ఉంటూ ఇటువంటి అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

More Telugu News